హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

SKLM: ఆముదాలవలసలో అరుణోదయ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 30 గ్రామాల వయోజన విద్యా కేంద్రాల్లో అక్షరాస్యత పొందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇండియన్ బైబిల్ లెటర్స్ ట్రస్ట్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్ జి. అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. విద్య, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని డైరెక్టర్ పేర్కొన్నారు.