హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డుపై గొయ్యి పూడ్చిన స్కౌట్ విద్యార్థులు

NTR: గంపలగూడెం ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై గొయ్యి ఏర్పడింది. వాహనదారులకు చాలా ప్రమాదకరంగా ఉన్నదని గమనించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కౌట్ విద్యార్థులు పాఠశాలలో వేస్ట్‌గా ఉన్న మెటీరియల్ తీసుకొని గొయ్యి పూడ్చారు. దీంతో వాహనదారులకు రాకపోకలకు సౌకర్యవంతం చేశారు. విద్యార్థులు, స్కౌట్ మాస్టర్ కిరణ్ కుమార్‌ను హెచ్ఎం అభినందించారు.