హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్ నిర్ణయంపై DK ఫైర్

టీమిండియా కోచ్ గంభీర్‌పై దినేష్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో శివమ్ దూబే కంటే ముందుగా, హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. గతంలో హర్షిత్ పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసిన సందర్భం తనకు గుర్తులేదన్నాడు. దూబే లాంటి స్పెషలిస్ట్ బ్యాటర్ ఉండగా, హర్షిత్‌ను బ్యాటింగ్‌కు పంపడం చెత్త నిర్ణయమన్నాడు.