హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-10లో ముగ్గురు IND బ్యాటర్లు

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 5వ స్థానంలో నిలవగా, షెఫాలీ వర్మ 6వ స్థానాన్ని, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాగా లారా వోల్వార్డ్ మూడో స్థానంలో, హేలీ మాథ్యూస్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.