NLG: చండూరు మున్సిపాలిటీ 10వ వార్డులో "వనమహోత్సవం - 2026" లో భాగంగా ఇంటింటికి పండ్ల, ఔషధ, నీడనిచ్చే మొక్కలను పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. అన్ని వార్డుల్లోనూ ఈ పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
వార్తలు
'నాటిన ప్రతి మొక్కను కాపాడాలి'


