హైదరాబాద్: 28°C
వార్తలు

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్ స్టేషన్‌లో జూలై 11న జరిగే జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. సీఐ పీ. కృష్ణ, ఎస్సై ఎస్.కే. మదీనా భాష ఆధ్వర్యంలో ఇరు వర్గాల వారితో చర్చించి రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా తక్కువ సమయంలో, కోర్టు ఖర్చులు లేకుండా శాశ్వత పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు.