SRCL: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ మల్లన్న, ఎల్లమ్మ గుడుల్లో ఈ నెల 2న జరిగిన దొంగతనం కేసును పోలీసులు 5 రోజుల్లో ఛేదించారు. వేములవాడకు చెందిన ఊరడి కుశుడు అలియాస్ లక్ష్మణ్ అనే మైనర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి టీవీఎస్ ఎక్సెల్ బైక్, రూ.1300, వెండి పూత దేవుడి కళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి చెప్పారు.
వార్తలు
దొంగతనం కేసులో మైనర్ బాలుడి అరెస్ట్


