హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమంగా పసికందు అమ్మకం.. అప్పగించిన పోలీసులు

PDPL: ధర్మారం మండలం బొట్ల వనపర్తికి చెందిన రెడపాక రమ తన 15 రోజుల పసికందును భర్త అశోక్, అతని బావమరిది దూడ మహేష్ మరికొందరు కలిసి సీసీసీ నస్పూర్‌కు చెందిన సుదర్శన్ దంపతులకు రూ. 2,00,000 అమ్మినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి మంగళవారం రమకు తన బిడ్డను సురక్షితంగా అప్పగించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.