KMM: ఖమ్మం టీటీడీసీలో జూలై 10న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి, 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ప్లంబింగ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె కోరారు.
వార్తలు
జూలై 10న జాబ్ మేళా


