హైదరాబాద్: 28°C
వ్యాపారం

రూ.20,000 కోట్ల పెట్టుబడులకు టాటా స్టీల్ స్కెచ్

ప్రస్తుత FY(2026-27)లో సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని టాటా స్టీల్ సంస్థ నిర్ణయించింది. ఇందులో 60% నిధులను దేశంలోని వ్యాపారాలకే కేటాయించనుంది. గతేడాది వెచ్చించిన రూ.14,559 కోట్ల కంటే ఇది 38% ఎక్కువని కంపెనీ CEO నరేంద్రన్, CFO కౌశిక్ తెలిపారు. దీర్ఘకాలంలో తమ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకుపైగా పెంచడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.