హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన

VZM: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విమానాశ్రయ నిర్మాణ పనులు, మౌలిక వసతుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారని విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.