హైదరాబాద్: 28°C
క్రీడలు

'వైభవ్‌ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు'

భారత జట్టులో అత్యంత పిన్న వయసులోనే అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ ఆటతీరుపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ఇంగ్లాండ్‌పై రెండో టీ20లో అతడు కేవలం 'ట్రైలర్' మాత్రమే చూపించాడని, అంతర్జాతీయ వేదికపై ఎలాంటి బెరుకు లేకుండా ఆడటం తనకు నచ్చిందని పేర్కొన్నాడు. వైభవ్‌కు సుదీర్ఘ కెరీర్ సాగించే సత్తా ఉందన్నాడు.