హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం

అనంతపురం హమాలీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. తమ ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజేష్, ఉమా దంపతులపై ఆకతాయిలు కక్షగట్టారు. అర్ధరాత్రి సమయంలో వారి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి పెట్రోల్ విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. ఈ ఘోర ఘటనపై బాధితులు ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు.