హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఉదయం నుంచే కొనుగోళ్ల జోరు కొనసాగింది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 78,285 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 159 పాయింట్ల లాభంతో 24,430 మార్కు వద్ద ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు మార్కెట్లను లాభాల వైపు నడిపించాయి.