ASR: అనంతగిరి మండలం దిగువ పట్టి జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడంపై ఎంఈవో బాలాజీ స్పందించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ద్వారా ఇప్పటికే ఒక ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై నియమించామన్నారు. అయితే ఆయన విధుల్లో చేరడం లేదని తెలిసిందన్నారు. 50మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వెంటనే విధుల్లో చేరాలన్నారు. ఉత్తర్వులను బేఖాతరు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
వ్యాపారం
'ఉపాధ్యాయుడు వెంటనే విధుల్లో చేరాలి'


