హైదరాబాద్: 28°C
వార్తలు

'శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలి'

కృష్ణా: డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమైక్యత కోసం ముఖర్జీ చేసిన త్యాగం చిరస్మరణీయమని, నేటి యువత ఆయన దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.