హైదరాబాద్: 28°C
వార్తలు

'వంట సహాయకురాలి పోస్టు ఖాళీ'

NZB : జక్రాన్ పల్లి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో వంట సహాయకురాలి ఒక పోస్టు ఖాళీగా ఉందని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. 7వ తరగతి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూలై 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కేర్టేకర్ కమ్ వార్డెన్ శిరీషను సంప్రదించాలని ఆయన తెలిపారు.