హైదరాబాద్: 28°C
క్రీడలు

స్వర్ణయుగంలో మహిళా క్రికెట్: జైషా

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఏడోసారి విజేతగా నిలిచింది. కెప్టెన్ సోఫీ మోలినెక్స్‌కు ఐసీసీ ఛైర్మన్ జై షా ట్రోఫీని అందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ.. మహిళా క్రికెట్ ప్రస్తుతం స్వర్ణయుగంలో ఉందన్నారు. ఈ ప్రపంచ కప్‌ను ఆకర్షణీయంగా మార్చిన ప్రతి జట్టుకూ ధన్యవాదాలంటూ జై షా SMలో పోస్టు చేశారు.