హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉసిరికాయ పులిహోరా.. ఎన్ని లాభాలో తెలుసా?

ఉసిరికాయ పులిహోరా ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందించి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరిలోని గుణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.