హైదరాబాద్: 28°C
క్రైమ్

నాంపల్లి కోర్టులో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. కోర్టు మూడో అంతస్తులోని ఓ గదిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.