శ్రీలంకలోని నెగోంబో జైల్లో రెండు ఖైదీల గ్రూపుల మధ్య జరిగిన ఘోర ఘర్షణలో ఇద్దరు మరణించగా, 34 మంది గాయపడ్డారు. డ్రగ్స్ వ్యవహారం, జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటమే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది. ఓవైపు ఈ గొడవ జరుగుతుండగానే.. డెంగీ వ్యాప్తిపై మహిళా ఖైదీలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తత పెరగడంతో అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపుచేశారు.
క్రైమ్
జైల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి


