హైదరాబాద్: 28°C
వార్తలు

ఖండాల ప్రాంతం వద్ద పర్యాటకుల తాకిడి

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల అటవీ ప్రాంతంలోని ఎత్తయిన కొండలు, లోయలు ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు పర్యాటకులు ఆదివారం క్యూ కట్టారు. పొగ మంచుతో కూడుకొని ఉన్న ప్రాంతాలు కాశ్మీర్‌ను తలపిస్తున్నాయి. ఈ అందమైన ప్రకృతిని చూసేందుకు పర్యాటకులు రెడీ అవుతున్నారు.