AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. చర్లపల్లి- షాలిమార్ రైలు ఢీకొని నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నారు. చేబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఆత్మహత్యా లేదా ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ATM కార్డు, తాడేపల్లిగూడెం RTC డిపో పార్కింగ్ రసీదు లభ్యమైంది.
క్రైమ్
BREAKING: రైలు ఢీకొని నలుగురు మృతి


