SS: ధర్మవరంలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్టపర్తి డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నేకొత్తపల్లి నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న వేణుగోపాల్‌ను వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు.
వార్తలు
ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు


