హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలోని వేగంగా సాగుతున్న SIR ప్రక్రియ

SS: జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,576 మంది బీఎల్‌వోలు 14,23,839 మంది ఓటర్ల వివరాల సేకరణలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 99.37 శాతం ఫారాలను పంపిణీ చేయగా, మడకశిర నియోజకవర్గం 100 శాతం పంపిణీతో అగ్రస్థానంలో నిలిచింది. పంపిణీ చేసిన వాటిలో 47.86 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయింది.