హైదరాబాద్: 28°C
వార్తలు

మైనారిటీ యువతకు మెగా జాబ్ మేళా

SS: జిల్లా మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 11న విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 65 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మసీ సహా 15 రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పదో తరగతి నుంచి పీజీ చదివిన వారు అర్హులు.