హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్ టెర్రర్.. నలుగురు మృతి

TG: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఓ కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.