TG: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కల్లూరులో కొడుకుపై కన్న తండ్రి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మద్యం మత్తులో తండ్రీ, కొడుకుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సీతారాములు ఇంట్లో ఉన్న కత్తితో కిరణ్ తల వెనుక భాగంలో బలంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
మద్యం మత్తులో కొడుకును నరికి చంపిన తండ్రి


