బరువు తగ్గుతామని చాలా మంది డిన్నర్ స్కిప్ చేస్తారు. కానీ దీనివల్ల జీవక్రియ మందగిస్తుంది. గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. రాత్రి పూట ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. మరుసటి రోజు ఉదయం అతిగా తినే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి భోజనం పూర్తిగా మానకుండా.. సలాడ్స్, సూప్స్ వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆరోగ్యం
రాత్రిపూట భోజనం మానేస్తున్నారా?


