హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జీన్స్‌తోనే నిద్రపోతున్నారా?

జీన్స్‌ ధరించి నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. జీన్స్‌ గట్టిగా, బిగుతుగా ఉండటం వల్ల శరీరానికి గాలి అందదు. దీనివల్ల చర్మ సమస్యలు, దురదలు రావచ్చు. రాత్రిపూట రక్త ప్రసరణకు అడ్డుతగిలి, ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా, నిద్రలో శరీరం విశ్రాంతి కోరుకుంటుంది, కానీ జీన్స్‌తో నిద్రించడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి, గాఢనిద్రకు భంగం కలుగుతుంది.