MDCL: అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. వర్షాల కారణంగా చెత్త కుళ్లిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని భక్తులు ఆరోపిస్తూ.. వెంటనే చెత్త తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వార్తలు
ఆలయంలో పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన


