హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పోలాకిలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

SKLM: పోలాకి మండలంలో కేంద్రమంత్రి రామ్మోహన్ ఆదివారం పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తితో కలిసి ఉదయం 9 నుంచి రాత్రి 7:30 వరకు వివిధ గ్రామాల్లో రోడ్లు, బస్ షెల్టర్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారని ఎమ్మెల్యే రమణమూర్తి తెలిపారు.