హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్యాంగుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

SKLM: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పథకం కింద అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్ల పంపిణీకై ఈనెల 7న దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ టి.రవి ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారరు. దీనిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.