శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఎ పటిష్ట స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 541 పరుగులు చేసి, 175 రన్స్ ముందంజలో ఉంది. ఓపెనర్ సాయి సుదర్శన్ (168) భారీ శతకంతో కదంతొక్కగా.. దేవ్ దత్ పడిక్కల్ (94), కెప్టెన్ ధ్రువ్ జురెల్ (53) అర్ధ సెంచరీలతో రాణించారు.
క్రీడలు
ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ స్కోరు..!


