హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకపై భారత్‌ సంచలన విజయం

శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లంక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత బ్యాటర్లలో కుశాగ్రా ఓజా (92), సాగర్ విర్క్ (57), లక్ష్య రాజేశ్ (52) అర్ధశతకాలతో జట్టుకు విజయాన్ని అందించారు.