హైదరాబాద్: 28°C
క్రీడలు

నెట్స్‌లో శ్రమిస్తున్న శ్రేయస్ సేన

ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ పోరు కోసం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సహా టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.