హైదరాబాద్: 28°C
క్రీడలు

సాయి సుదర్శన్‌ భారీ ఇన్నింగ్స్‌

శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత-ఏ ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో 132 పరుగులతో రాణించిన అతడు, గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. విదేశీ గడ్డపై సుదర్శన్ నుంచి ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు రావడం శుభపరిణామం.