హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 10న అథ్లెటిక్స్ ఎంపికలు'

శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి మైదానంలో ఈనెల 10న జాతీయ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదనరావు, సాంబమూర్తి తెలిపారు. ఆసక్తి గల బాలబాలికలు జనన, ఆధార్ కార్డులతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొంటారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.