హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రేడింగ్ యాప్ పేరుతో రూ.4 లక్షల మోసం

GNTR: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టి రూ.4 లక్షలు మోసపోయానని వసంతరాయపురానికి చెందిన లలిత అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితురాలి ద్వారా యాప్ గురించి తెలుసుకుని పెట్టుబడి పెట్టిన ఆమెకు విత్‌డ్రా అవకాశం ఇవ్వకుండా మరింత డబ్బు పెట్టాలని నిర్వాహకులు ఒత్తిడి చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.