హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వన దుర్గమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు

​MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్యక్షేత్రంలో ఇవాళ శ్రీ వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాస కృష్ణపక్షం, సప్తమి, స్థిర వాసరే తిథిని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అర్చకులు శ్రద్ధాభక్తులతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.