హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాలయానికి మొదటి నెల జీతం విరాళం

SKLM: సంతబొమ్మాలి మండలం కాశీపురం గ్రామానికి చెందిన పూడి రాంబాబు కుమారుడు పూడి అభిషేక్ తన మొదటి నెల జీతం రూ.లక్షను కాశీపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి విరాళంగా అందజేశారు. ఆలయ శాశ్వత ధర్మకర్త లమ్మత లక్ష్మినాయుడుకు గ్రామస్తుల సమక్షంలో మంగళవారం విరాళాన్ని అందించారు. అభిషేక్‌ సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.