హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీసీసీ DR డిపోపై ఏనుగుల దాడి

పార్వతీపురం మండలం అడ్డూరివలస గ్రామంలోని జీసీసీ డీఆర్‌ డిపోపై సోమవారం అర్ధరాత్రి ఏనుగులు దాడి చేశాయి. రాత్రి ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య షట్టర్‌ను ఏనుగులు ఢీకొట్టడంతో కొంతమేర దెబ్బతింది. షట్టర్‌ తెరుచుకోకపోవడంతో ఏనుగులు వెనుదిరిగాయి. లోపల ఉన్న సుమారు 40 బస్తాల బియ్యం పూర్తిగా సురక్షితంగా నిలిచాయి. ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేనేజర్‌ సాంబ తెలిపారు.