హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు నిర్మించాలి'

ASR: డుంబ్రిగూడ మండలం గత్తర జిలేడ గ్రామానికి వెళ్లే రహదారిని వెంటనే నిర్మించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు. సుమారు 3 కిలోమీటర్ల రహదారి లేక ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.