BPT: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడు–తుమ్మలపల్లి రోడ్డులో మంగళవారం ఉదయం వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి పల్టీలు కొడుతూ పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. స్మశానం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మండలంలో వరుసగా వాటర్ ట్యాంకర్ ప్రమాదాలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొలాల్లోకి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్!


