హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు బీభత్సం.. మృతురాలి వివరాలు లభ్యం

ATP: బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతిచెందిన మహిళను గుత్తికి చెందిన హరితగా గుర్తించారు. టాటా సఫారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆమె మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ హోటల్ ధ్వంసమైంది.