PLD: మాచవరం ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. పిన్నెల్లికి చెందిన బాలింత కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో విధుల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్సు అందుబాటులో లేకపోవడంతో ఆయాతో కాన్పు చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాన్పు అనంతరం శిశువు పరిస్థితి విషమించి మృతి చెందగా, తల్లికూడా అస్వస్థత ఏర్పడింది. సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఈ ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాన్పు కోసం ఆస్పత్రికి వస్తే.. శిశువు మృతి!


