హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంజనీర్ల కృషితో దేశానికి మరింత అభివృద్ధి: మంత్రి

NDL: దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు ఎంతో కీలకమని మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఇవాళ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆలోచనలు, నైపుణ్యాలను మేళవించి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్ల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.