NTR: విజయవాడ కృష్ణలంకలో ఈసారి వినాయక చవితి ప్రత్యేకంగా జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథ్ రూపంలో వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగారు. పసుపు-ఎరుపు అలంకరణలతో అలరారిన విగ్రహాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. భజనలు, నామస్మరణలతో ప్రాంగణం భక్తిమయమైంది.
ఆంధ్రప్రదేశ్
కృష్ణలంకలో జగన్నాథ్ అవతార వినాయకుడు


