హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్లంపల్లిలో ఘనంగా కప్పలమ్మ జాతర

KDP: మైదుకూరు పరిధిలోని ఎల్లంపల్లిలో కప్పలమ్మ జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని రైతులు కప్పలమ్మను ప్రార్థించారు. సాంప్రదాయ పాటలు పాడుతూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.