హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీడికాడలో ఆకట్టుకున్న డాన్స్ బేబీ డాన్స్

అనకాపల్లి జిల్లా చీడికాడలో గత రాత్రి వినాయక చవితి సందర్భంగా యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్రామ కూడలిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వందలాది మంది తిలకించారు. యువతులు వేసిన డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా యువత ఈలలతో సందడి చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.